నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటలపాటు దేశవ్యాప్త రైలు రోకో

  • నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
  • దేశవ్యాప్త రైల్‌రోకోకు సిద్ధమవుతున్న రైతులు
  • 20 వేల మంది సిబ్బందిని మోహరించిన ఆర్ఫీఎస్ఎఫ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు నాలుగు గంటలపాటు దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టనున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా రెడీ అవుతోంది. రైల్‌రోకో నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్పీఎస్‌ఎఫ్ దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోహరించింది. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పశ్చిమబెంగాల్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. 


More Telugu News