రాముడి పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు: ఉద్ధవ్ థాకరే
- మోసపూరిత శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి
- ఈ నెల 22 నుంచి 27 వరకు శివ్ సంపర్క్ కార్యక్రమం
అయోధ్య రామ మందిర నిర్మాణానికి డబ్బులు వసూలు చేస్తున్న కొన్ని మోసపూరిత శక్తుల పట్ల శివసైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఇదే అంశంపై ప్రజల్లో శివసేన నేతలు, కార్యకర్తలు చైతన్యాన్ని కలిగించాలని సూచించారు. బీజేపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
పార్టీ బేస్ ను మరింత విస్తరింపజేసేందుకు ఈ నెల 22 నుంచి 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 'శివ్ సంపర్క్' పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు థాకరే తెలిపారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయాలను, పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు.