విజయసాయిరెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు: బుద్ధా వెంకన్న
- విజయసాయి పాదయాత్ర చేయాల్సింది విశాఖలో కాదు ఢిల్లీలో
- ఆంధ్రాభవన్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేయాలి
- కేసుల మాఫీ కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు
వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడానికి విశాఖలో పాదయాత్రను చేపట్టబోతున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఏ2 విజయసాయిరెడ్డి పాదయాత్ర పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. ఉక్కు కార్మికులకు మద్దతుగా పాదయాత్ర చేస్తానని ఏ2 ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.
విజయసాయి పాదయాత్ర చేయాల్సింది విశాఖలో కాదని... ఢిల్లీలో చేయాలని బుద్ధా వెంకన్న అన్నారు. ఢిల్లీలో ఆంధ్రాభవన్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేయాలని చెప్పారు. దోపిడీ చేయడానికే జగన్, విజయసాయిలు విశాఖపై కన్నేశారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద ఏపీని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. విజయసాయి చెప్పే మాటలను విశాఖ ప్రజలు నమ్మరని అన్నారు. వైసీపీ నేతలు డ్రామాలు ఆపాలని, విశాఖ ఉక్కు కోసం చిత్తశుద్ధితో పోరాడాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం చేతకాకపోతే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.