'ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు' అంటూ వీడియో పోస్ట్ చేసిన టీడీపీ!
- శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఘటన
- వైసీపీ బలపరుస్తున్న అభ్యర్థికి ఓట్లు వేయాలని బెదిరింపు
- వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తానని వ్యాఖ్య
'ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు' అంటూ తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పాల్పడుతోన్న చర్యలపై విమర్శలు గుప్పించింది.
'శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరుస్తున్న అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ప్రభుత్వం నుంచి ప్రజలకు వస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేస్తానని, ఒకవేళ టీడీపీ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపిస్తే రెండు నెలల్లో చెక్ పవర్ తీసేస్తానని బహిరంగంగా ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు కొత్తకోట చిరంజీవి' అని టీడీపీ పేర్కొంది.
'ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు కొత్తకోట చిరంజీవిపై ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ అభ్యర్థికి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. సంక్షేమ పథకాలు నీ సొంత డబ్బుతో ఇస్తున్నావా జగన్ రెడ్డి?' అని టీడీపీ పేర్కొంది.