విశాఖ శారదా పీఠానికి చేరుకున్న వైఎస్ జగన్!
- నేటి నుంచి శారదా పీఠం వార్షికోత్సవాలు
- ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సీఎం
- ఐదు రోజుల పాటు వేడుకలు
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం బయలుదేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్, పీఠానికి చేరుకున్నారు. నేటి నుంచి పీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానుండగా, పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, తదుపరి పీఠానికి అధిపతి కానున్న స్వాత్మానందేంద్ర సరస్వతి నేతృత్వంలో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు సాగనున్నాయి.
ఈ కార్యక్రమాల తొలి రోజున జగన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. స్వామీజీలతో కలసి గోపూజ, శమీ వృక్ష పూజ చేయనున్న జగన్, ఆపై ప్రారంభం కానున్న రాజశ్యామల యాగంలోను పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.