కేసీఆర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!

  • నేడు కేసీఆర్ పుట్టిన రోజు
  • ఆయన ఆరోగ్యంగా ఉండాలి
  • భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న మోదీ
నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మోదీ ఓ ట్వీట్ పెట్టారు. "తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘకాలం ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు.

ఇక తన తండ్రికి బర్త్ డే విషస్ తెలిపిన కేటీఆర్, "ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన నేత. ఎంతో మందిని ఉద్యమం దిశగా నడిపించి, ఇప్పుడు అద్భుతమైన పరిపాలకుడిగా మారిన నేత. భవిష్యత్తుకు నిలువెత్తు అద్దంలా నిలిచిన ఆ వ్యక్తిని నేను నాన్నా అని పిలవడం నా అదృష్టం" అన్నారు.


More Telugu News