'బిగ్ బాస్కెట్' ఇక టాటాల పరం!
- 60 శాతం వాటాలు కొనేందుకు డీల్
- 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి
- ఇప్పటికే అలీబాబాకు 30 శాతం వాటా
భారత వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్, నిత్యావసరాల డెలివరీ స్టార్టప్ బిగ్ బాస్కెట్ లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ సేవల వరకూ విస్తరించిన టాటా సంస్థ, బిగ్ బాస్కెట్ లో 60 శాతం వాటాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ డీల్ విలువ 1.8 బిలియన్ డాలర్ల నుంచి 2 డాలర్ల వరకూ ఉండవచ్చు. ఇటీవల బిగ్ బాస్కెట్ విస్తరణ ప్రణాళికల అమలు నిమిత్తం 750 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్కెట్ లో ఇప్పటికే చైనా ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబాకు 30 శాతం వాటాలు ఉన్నాయి. ఇదే సమయంలో టాటా గ్రూప్ తో డీల్ అనంతరం సంస్థలో ఇన్వెస్టర్ గా ఉన్న అబ్రాజ్ గ్రూప్ సహా మిగతా సంస్థలు వైదొలగనున్నాయని సంస్థ వర్గాలు వెల్లడించాయి. భారత కంపెనీల్లో చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు పెరిగిన నేపథ్యంలో మరింత వాటాను కొనాలన్న అలీబాబా కోరిక నెరవేరే అవకాశాలు హరించుకుపోయాయి.
వచ్చే సంవత్సరం ఐపీఓకు రావడం ద్వారా ప్రజల నుంచి వాటాలు సేకరించాలన్న ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థ విలువను మరింతగా పెంచుతూ టాటా గ్రూప్ ఎంటర్ కావడం గమనార్హం. బిగ్ బాస్కెట్ లో టాటాల ఎంట్రీపై దాదాపు ఆరు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. రెండు కంపెనీల మధ్యా చర్చలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం బహిర్గతం కాగా, తాజాగా ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలుస్తోంది.
ఇక ఈ విషయంలో అధికారికంగా స్పందించేందుకు అటు టాటా గ్రూప్, ఇటు బిగ్ బాస్కెట్ నిరాకరించాయి. ప్రస్తుతం బిగ్ బాస్కెట్ దాదాపు 24 నగరాలు, పట్టణాల్లో నిత్యావసరాలను డోర్ డెలివరీ చేస్తూ, రిలయన్స్ జియో మార్ట్, గ్రూఫర్స్ సంస్థలకు గట్టి పోటీని ఇస్తోంది.