ఆంధ్రప్రదేశ్‌లో వార్షిక బడ్జెట్‌పై ఆర్డినెన్స్!

  • వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం యోచన
  • మునిసిపల్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
  • అవి లేకుంటే మార్చి 14 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మార్చి 14వ తేదీ వరకు మునిసిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం సిద్ధమైతే బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌కు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగకుంటే కనుక వచ్చే నెల 14 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనేది ప్రభుత్వ యోచన. అదే జరిగితే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం లభిస్తుంది.


More Telugu News