పార్టీ చేసుకున్న ఫలితం.. బెంగళూరులో ఒకే అపార్ట్‌మెంట్‌లో 103 మందికి కరోనా
- 1500 మంది నివసిస్తున్న అపార్ట్‌మెంట్
- అపార్ట్‌మెంట్‌లో జరిగిన విందులో పాల్గొన్న 45 మంది
- ఆ తర్వాత ఒక్కసారిగా వ్యాప్తి చెందిన వైరస్
బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంటు వాసులు ఏర్పాటు చేసిన పార్టీ అనంతరం 103 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. నగరంలోని బిలేకళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 435 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 1500 మంది నివసిస్తున్నారు. ఈ నెల 6న అపార్ట్‌మెంట్‌లో జరిగిన పార్టీలో 45 మంది పాల్గొన్నారు.
ఆ తర్వాత నాలుగు రోజులకు కొందరిలో కరోనా లక్షణాలు బయటపడడంతో అందరికీ పరీక్షలు నిర్వహించారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 103 మందికి కరోనా సోకినట్టు తేలింది. మొత్తం వెయ్యి మందికి పరీక్షలు చేయగా, మిగతా వారి ఫలితాలు రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు అపార్ట్‌మెంట్‌కు చేరుకుని శానిటైజ్ చేశారు. బాధితులందరినీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.