ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్
- మూడు జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో దాఖలు కాని నామినేషన్లు
- 579 పంచాయతీల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవం
- ఓటు హక్కును వినియోగించుకోనున్న 55,75,004 మంది
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ మొదలుకాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మద్యాహ్నం 1.30 వరకు పోలింగ్ జరుగుతుంది.
ఈ దశలో మొత్తం 3,221 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 579 ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో మొత్తం 55,75,004 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.