హైదరాబాద్‌లో రూ.92.84కి పెరిగిన లీటరు పెట్రోలు ధర
- వరుసగా ఎనిమిదో రోజు పెరిగిన ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధర రూ.79.70
- ముంబైలో పెట్రోల్ ధర లీటరుకి రూ.95.75
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజు పెరిగిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో వరుసగా ఎనిమిదో రోజు కూడా పెరగడం గమనార్హం. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధర రూ.79.70 కి చేరింది.
ముంబైలో పెట్రోల్ ధర లీటరుకి రూ.95.75కి చేరింది. అలాగే, డీజిల్ ధర రూ.86.35కు ఎగబాకింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర లీటరు రూ.92.84కి చేరగా, డీజిల్ ధర రూ.86.93గా ఉంది. బెంగళూరులో లీటరు పెట్రోలు ధర రూ.92.28, డీజిల్ ధర రూ.84.49గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.91.45, డీజిల్ ధర రూ.84.77గా ఉంది.