ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి

  • రెండు టీకాలకు అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ 
  • కోవ్యాక్స్ ప్రోగ్రాంలో కీలక అడుగు
  • కోవ్యాక్స్ కార్యక్రమంలో 190 దేశాలు 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిన్న రెండు కరోనా టీకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఒకటి భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కాగా, రెండోది దక్షిణ కొరియాకు చెందిన ఆస్ట్రాజెనెకా-ఎస్‌కే బయో కంపెనీ తయారు చేసినది. ఈ రెండింటి వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ నిన్న అనుమతి ఇచ్చింది.

ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ.. ఈ రెండు టీకాలకు అనుమతి ఇవ్వడంతో కోవ్యాక్స్ ప్రోగ్రాం తరపున ప్రపంచ దేశాలకు టీకా అందించేందుకు మార్గం సుగమం అయిందన్నారు. కోవ్యాక్స్ పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే కార్యక్రమం చేపట్టింది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు కోవ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇవన్నీ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ముందుకొచ్చాయి.


More Telugu News