టీడీపీ నేత పల్లా ఆమరణదీక్ష భగ్నం.. బలవంతంగా ఆసుపత్రికి తరలింపు
- స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆరు రోజులుగా ఆమరణదీక్ష
- పల్లాకు మద్దతు తెలిపేందుకు నేడు వైజాగ్‌కు చంద్రబాబు
- ఆయన రావడానికి ముందే దీక్షను భగ్నం చేసిన పోలీసులు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లాకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖ రానున్నారు.
అయితే, చంద్రబాబు నగరానికి రావడానికి ముందే పోలీసులు పల్లా దీక్షను భగ్నం చేశారు. దీక్ష శిబిరం నుంచి ఆయనను బలవంతంగా కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.