మెమరీ పవర్ పెంచుతానంటూ ఇంజెక్షన్లు... ట్యూషన్ మాస్టర్ నిర్వాకం!
- ఢిల్లీలో ఘటన
- హైస్కూల్ విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్న బీఏ విద్యార్థి
- సెలైన్ ద్రావణాన్ని ఇంజెక్షన్ గా ఇస్తున్న వైనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ విద్యార్థి తండ్రి
ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన వద్దకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఓ యువకుడు సెలైన్ ద్రావణాన్ని ఇంజెక్షన్ల రూపంలో ఇస్తుండడం కలకలం రేపింది. ఆ ఇంజెక్షన్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని తమ ట్యూషన్ మాస్టర్ చెప్పడంతో విద్యార్థులు నమ్మేశారు.
ఢిల్లీలోని మంద్ వాలీ ప్రాంతానికి చెందిన సందీప్ బీఏ చదువుతున్నాడు. ఖాళీ సమయంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెబుతుంటాడు. అయితే జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే తన వద్ద మంచి మందు ఉందని విద్యార్థులను నమ్మబలికాడు. వారికి సెలైన్ బాటిళ్లలోని ద్రావణాన్ని ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ప్రారంభించాడు. దీనిపై ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ట్యూషన్ మాస్టర్ సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో అతడు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. యూట్యూబ్ లో చూసిన వీడియోల ప్రకారం ఆ ఇంజెక్షన్లు ఇచ్చానని తెలిపాడు. సెలైన్ ద్రావణం జ్ఞాపకశక్తిని పెంచుతుందని ఆ వీడియోల్లో చూశానని వివరించాడు.