కేవలం ఇద్దరి కోసం ప్రజలందరినీ దోచుకుంటున్నారు: మోదీపై రాహుల్ ఫైర్
- మరో రూ. 50 పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
- సబ్ కా వికాస్ అని చెప్పే మోదీ ఇద్దరి వికాసం కోసమే పని చేస్తున్నారు
- సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపాటు
వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందని దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ. 50 పెరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రాహుల్ హిందీలో ట్వీట్ చేస్తూ, 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటూ నినాదాలు చేసే ప్రధాని మోదీ... జనాలను దోచేస్తూ, కేవలం ఇద్దరికి మాత్రమే వికాసాన్ని ఇస్తున్నారని విమర్శించారు. అయితే ఆ ఇద్దరి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. వారిద్దరూ అనిల్ అంబానీ, గౌతమ్ అదానీలే అయి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పిస్తూ గతంలో రాహుల్ ట్వీట్ చేసిన సందర్భంగా... అంబానీ, అదానీలను ట్యాగ్ చేయడం గమనార్హం. ఇద్దరు ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం మోదీ పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజల సంక్షేమాన్ని మోదీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.