నెల రోజుల్లో రెండోసారి.. మరో రూ. 50 పెరిగిన వంటగ్యాస్ ధర
- మూడు నెలల్లో రూ. 200 పెంపు
- నేటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర రూ. 821
- ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి బాదుడు
వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోమారు పెరిగాయి. డిసెంబరులో రెండుసార్లు పెరిగిన ధరలు జనవరిలో ఒకసారి పెరిగాయి. తాజాగా మరో రూ. 50 పెరిగింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి రూ.821కి పెరిగింది. మూడునెల్లలో మొత్తంగా సిలిండర్‌పై రూ. 200 పెరగడం గమనార్హం. అయితే, ఈ బాదుడు ఇప్పట్లో ఆగేలా లేదు.
ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తున్న ప్రభుత్వం అదే విధానాన్ని గ్యాస్‌పైనా అమలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే నేటి నుంచి ధరల పెంపు అమలు మొదలుపెట్టింది. అంటే మరో 15 రోజుల తర్వాత మరోమారు బాదుడు ఉంటుందన్న మాట.