చెన్నై పిచ్ నాణ్యతపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు

  • రెండో టెస్టులో స్పిన్నర్ల హవా
  • రెండో రోజు ఆటలో 10 వికెట్లు తీసిన స్పిన్నర్లు
  • పిచ్ భయంకరంగా ఉందన్న మైకేల్ వాన్
  • టెస్టు క్రికెట్ కు ఈ పిచ్ తగదని వెల్లడి
  • తాను సాకులు చెప్పడంలేదని వివరణ
చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో స్పిన్నర్లదే రాజ్యం అయింది. తొలి రోజు నుంచే ఇక్కడి చెపాక్ పిచ్ పై బంతి గింగిరాలు తిరుగుతూ వస్తోంది. దాంతో ఇవాళ ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలగా, అందులో స్పిన్నర్ల వాటా 10 వికెట్లు. దీన్నిబట్టే ఈ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అనడంలో తప్పేలేందని అర్థమవుతుంది. అయితే, ఈ పిచ్ నాణ్యతపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు చేశాడు.

ఇదొక భయంకరమైన పిచ్ అని, ఐదు రోజుల టెస్టు క్రికెట్ కు ఏమాత్రం తగని పిచ్ అని వ్యాఖ్యానించాడు. ఈ టెస్టు మ్యాచ్ ద్వారా క్రికెట్ వినోదం లభిస్తుండడం నిజమే అయినా, పిచ్ మాత్రం పరమ దరిద్రంగా ఉందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉన్నందున తాను ఈ విధంగా సాకులు చెప్పడంలేదని, పిచ్ వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నానని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.

ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేయగా, ఇంగ్లండ్ మరీ పేలవంగా ఆడి 134 పరుగులకే కుప్పకూలింది.


More Telugu News