చంద్రబాబువి తప్పుడు లెక్కలు... మూడు, నాలుగు విడతల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి: మంత్రి పెద్దిరెడ్డి
- పంచాయతీ ఎన్నికల్లో వైసీపీదే ప్రభంజనమన్న పెద్దిరెడ్డి
- చంద్రబాబు, టీడీపీ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శలు
- ఎన్నికలు నిలిపివేయాలని కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యలు
- గెలవలేక కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఎద్దేవా
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థుల ప్రభంజనం చూసి చంద్రబాబు సహా టీడీపీ నేతలు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తొలి, రెండో విడత ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె, గుంటూరు జిల్లా మాచర్లలో ఎన్నికలు నిలిపివేయాలని టీడీపీ నేతలు కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘనవిజయం సాధిస్తున్నారని, జగన్ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ ఫలితాల సరళి ఇదే విధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.