యలమర్రు మా పూర్వీకుల గ్రామం... అక్కడ ఎవరు గెలిస్తే నాకేంటి?: కొడాలి నాని
- యలమర్రు పంచాయతీలో టీడీపీ విజయం
- మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ అంటూ కథనాలు
- యలమర్రు తన సొంతూరు కాదన్న నాని
- తాను గుడివాడలోనే పుట్టిపెరిగానని వెల్లడి
మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ విజయం అంటూ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తుండడం తెలిసిందే. దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. కృష్ణా జిల్లా యలమర్రు తన పూర్వీకుల గ్రామం అని, తనది గుడివాడేనని స్పష్టం చేశారు. యలమర్రులో ఎవరు గెలిస్తే నాకేంటి అంటూ వ్యాఖ్యానించారు. తాను యలమర్రులో ఓట్లు అడిగానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామని, యలమర్రు గ్రామంలో ఎవరు ఏ పార్టీకి చెందినవాళ్లో కూడా తనకు తెలియదని కొడాలి నాని స్పష్టం చేశారు. యలమర్రు పంచాయతీ పామర్రు నియోజకవర్గంలో ఉందని, అక్కడ వైసీపీ ఓడిపోతే అది నాకు ఎదురుదెబ్బ అంటూ సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.