ముగిసిన రెండో రోజు ఆట.... భారీ ఆధిక్యం దిశగా భారత్
- రెండో ఇన్నింగ్స్ లో భారత్ 1 వికెట్ నష్టానికి 54 రన్స్
- 249కి పెరిగిన భారత్ ఆధిక్యం
- తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసిన కోహ్లీ సేన
- 134 పరుగులకే చేతులెత్తేసిన ఇంగ్లండ్
- 5 వికెట్లు తీసిన అశ్విన్
చెన్నైలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 195 పరుగులతో కలుపుకుని టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 249 పరుగులకు చేరింది. ఆటకు ఇంకా మూడ్రోజుల సమయం మిగిలుండడంతో మ్యాచ్ ఫలితంపై రేపు స్పష్టత రానుంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 25 పరుగులతో, ఛటేశ్వర్ పుజారా 7 పరుగులతో ఉన్నారు. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 14 పరుగులు చేసి ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 134 పరుగులకే చాప చుట్టేసింది. సొంతగడ్డపై రవిచంద్రన్ అశ్విన్ విజృంభణకు ఇంగ్లండ్ జట్టు దాసోహమైంది. అశ్విన్ 5 వికెట్లు సాధించడం విశేషం.