హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన కేంద్రానికి లేదు: కిషన్ రెడ్డి
- హైదరాబాదు యూటీ అంశాన్ని లోక్ సభలో లేవెనెత్తిన ఒవైసీ
- జమ్మూకశ్మీర్ తరహాలో హైదరాబాద్ ను కూడా యూటీ చేస్తారని వ్యాఖ్యలు
- ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి
- సమాధానం చెప్పేలోపు ఒవైసీ పారిపోయారని ఎద్దేవా
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుతారంటూ జరుగుతున్న ప్రచారంపై పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. హైదరాబాదును యూటీగా మార్చే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. దీనిపై సమాధానం చెప్పే లోపు అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాదును కేంద్రం యూటీగా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
అంతకుముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో మాట్లాడుతూ, హైదరాబాద్ యూటీ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఒవైసీ మాట్లాడుతూ, హైదరాబాదును కూడా ఇదేవిధంగా యూటీ చేస్తారంటూ అనుమానం వెలిబుచ్చారు.