స్వదేశంలో 200 సిక్స్‌లు బాదిన‌ తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన‌ రికార్డు!

  • ఇంగ్లండ్ తో జ‌రుగుతోన్న‌ టెస్టులో రెండు సిక్స‌ర్లు
  • రోహిత్ త‌ర్వాతి స్థానంలో ధోనీ (186 సిక్స‌ర్లు)
  • అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మొత్తం క‌లిపి రోహిత్  428 సిక్స్ లు 
టీమిండియాలో మిగ‌తా బ్యాట్స్‌మెన్ విఫ‌ల‌మైన వేళ  రోహిత్‌ శర్మ మాత్రం త‌న‌దైన శైలిలో ఆడుతూ ఇంగ్లండ్ తో జ‌రుగుతోన్న‌ టెస్టులో సెంచ‌రీ చేసిన విషయం తెలిసిందే. నిన్న ఆయ‌న రెండు సిక్స‌ర్లు బాదాడు. వాటితో స్వదేశంలో టెస్టుల్లో 200 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్  రికార్డు సృష్టించాడు.

రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. రోహిత్ త‌ర్వాత స్వ‌దేశంలో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన బ్యాట్స్‌మ‌న్‌గా  టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని ఉన్నాడు. స్వదేశంలో ఆయ‌న‌ మొత్తం 186 సిక్స్‌లు కొట్టాడు. మాజీ క్రికెట‌ర్ యువరాజ్‌ సింగ్‌ 113 సిక్స్‌లు బాదాడు.

రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి ఇప్ప‌టివ‌ర‌కు 428 సిక్స్ లు కొట్టాడు. ఈ జాబితాలో ప్ర‌పంచంలోనే రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్  మొత్తం క‌లిపి  534 సిక్స్ ల‌తో తొలి స్థానంలో, పాక్‌ మాజీ ఆట‌గాడు ‌ ఆఫ్రిది 476 సిక్స్‌ల‌తో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వారిద్ద‌రి రికార్డులను రోహిత్ శ‌ర్మ బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. ‌ధోని 359 సిక్స్‌లతో ఆరో స్థానంలో ఉన్నాడు.



More Telugu News