ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై నిఘా ఉంటుంది: నిమ్మగడ్డ
- ఓటర్లు ఉత్సాహంతో ఓట్లు వేశారు
- ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారు
- కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రెండు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. రెండో విడత ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంతో ఓట్లు వేసి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు సగ భాగం పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగాయని చెప్పారు.
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేశారని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా అధికారులు చేసిన ఏర్పాట్లు, తీసుకున్న భద్రతా చర్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు. త్వరలో జరగనున్న మూడో విడత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘాను పెడతామని తెలిపారు. మిగతా దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.