వాలంటైన్స్ డేని 'మాతా పిత పూజా దినోత్సవం'గా పాటిస్తాం: ప్రమోద్ ముతాలిక్

  • ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే
  • ఎప్పట్నించో వ్యతిరేకిస్తున్న హిందుత్వ సంఘాలు
  • స్పందించిన శ్రీరామ్ సేన
  • వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదన్న ప్రమోద్ ముతాలిక్
ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డే పట్ల భారత్ లోని హిందుత్వ సంఘాల వ్యతిరేకత అంతాఇంతా కాదు. ప్రేమికుల రోజున బహిరంగంగా కనిపించే ప్రేమికులను పట్టుకుని పెళ్లిళ్లు చేయడం తెలిసిందే. దీనిపై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ స్పందించారు. వాలంటైన్స్ డేని తాము 'మాతా పిత పూజా దినోత్సవం'గా జరుపుకుంటామని, తల్లిదండ్రులను గౌరవించే దినంగా పరిగణిస్తామని చెప్పారు. వాలంటైన్స్ డే అనేది పాశ్చాత్య సంస్కృతికి చెందిన అంశమని తెలిపారు.

కర్ణాటకలో ప్రేమికుల రోజు సందర్భంగా జరిగే అభ్యంతరకర కార్యక్రమాలను అడ్డుకుంటామని, అందుకోసం ప్రత్యేకంగా స్వచ్ఛంద సేవకులను నియమిస్తామని వెల్లడించారు. పార్కులు, పబ్ లు, బార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లపై తమ వర్గాల నిఘా ఉంటుందని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. పోలీసులకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు.


More Telugu News