మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ప్రకటన
- ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు
- 579 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు నిమ్మగడ్డ వెల్లడి
- 2,640 పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్నామని వివరణ
- 7,756 అభ్యర్థులు బరిలో ఉన్నారన్న ఎస్ఈసీ
ఏపీలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటన చేశారు. అన్ని జిల్లాల్లో కలిపి 579 పంచాతీయలు, 11,732 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించారు. మిగిలిన 2,640 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 7,756 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని నిమ్మగడ్డ వివరించారు.
అటు, రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం కావడం తెలిసిందే. మూడో విడతలో అంతకుమించి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో ఈ నెల 21న జరిగే నాలుగో విడత పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.
అటు, రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం కావడం తెలిసిందే. మూడో విడతలో అంతకుమించి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో ఈ నెల 21న జరిగే నాలుగో విడత పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.