కరోనా తొలి కేసులపై డేటా ఇచ్చేందుకు చైనా నిరాకరించింది: డబ్లూహెచ్ఓ టీమ్ సభ్యుడు

  • చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్ఓ టీమ్
  • కరోనా పుట్టుకకు గత కారణాలను అన్వేషిస్తున్న టీమ్ సభ్యులు
  • రా డేటా అడిగితే.. సారాంశాన్ని  మాత్రమే ఇచ్చిన చైనా
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన హైలెవెల్ టీమ్ చైనాలో పర్యటిస్తోంది. కరోనా వైరస్ మూలాలను కనుక్కునే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ ఎలా పుట్టిందో కనిపెట్టేందుకు యత్నిస్తోంది. 2019 డిసెంబర్ లో వూహాన్ నగరంలో కరోనా వైరస్ తొలుత బయటపడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైరస్ ను తొలుత గుర్తించిన 174 పేషెంట్లకు చెందిన రా డేటాను ఇవ్వాలని చైనాను డబ్యూహెచ్ఓ టీమ్ కోరింది. అయితే పూర్తి డేటాను చైనా ఇవ్వలేదని, కేవలం దానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే అందించిందని టీమ్ లో సభ్యుడైన ఆస్ట్రేలియాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డోమినిక్ డ్వేయర్ తెలిపారు.

వైరస్ పుట్టుకను కనిపెట్టేందు పేషెంట్ల రా డేటా చాలా అవసరమని ఆయన చెప్పారు. అయితే ఆ డేటాను చైనా ఎందుకు ఇవ్వలేదనే విషయంపై తాను మాట్లాడలేనని అన్నారు. రాజకీయ కారణాల వల్ల ఇవ్వలేదా? లేదా ఇది సరైన సమయం కాదా? లేదా ఇవ్వడం కష్టమా? కారణం ఏమిటనేది తనకు తెలియదని చెప్పారు.


More Telugu News