ఉగ్రవాదుల రెక్కీ నేపథ్యంలో అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రత పెంపు
- అజిత్ దోవల్ కు ఉగ్రముప్పు
- నిఘా వర్గాల హెచ్చరిక
- దోవల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రత పెంపు
- జైష్ ఏ మహ్మద్ టెర్రరిస్టు ఇచ్చిన సమాచారంతో చర్యలు
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ కు ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దాంతో ఢిల్లీలోని అజిత్ దోవల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రత మరింత పెంచారు. అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రదాడికి కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఉగ్రవాదులు దోవల్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు గుర్తించారు.
ఈ నెల 6న జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందని హిదయతుల్లా మాలిక్ అనే టెర్రరిస్టును అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా హిదయతుల్లా నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ప్రస్తుతం దోవల్ ఇటీవల ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ పేలుడు తమ చర్యేనని జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.