బోయినపల్లి వినోద్ కుమార్ తనయుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం కేసీఆర్

  • హైటెక్స్ లో డాక్టర్ ప్రతీక్ నిశ్చితార్థ వేడుక
  • వరంగల్ ఎస్వీఎస్ విద్యాసంస్థల అధినేత కుమార్తెతో నిశ్చితార్థం
  • కాబోయే వధూవరులకు కేసీఆర్ ఆశీర్వాదాలు
  • నిశ్చితార్థానికి హాజరైన ఎర్రబెల్లి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తనయుడు డాక్టర్ ప్రతీక్ నిశ్చితార్థం ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఈ నిశ్చితార్థానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. బోయినపల్లి వినోద్ కుమార్ పెద్ద కుమారుడు డాక్టర్ ప్రతీక్ కు వరంగల్ ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ తిరుమల్ రావు కుమార్తెతో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ నిశ్చితార్థ వేడుకకు నగరంలోని హైటెక్స్ వేదికగా నిలిచింది.


More Telugu News