జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడంపై లోక్ సభలో అమిత్ షా స్పందన
- ఎప్పటికీ రాష్ట్ర హోదా ఇవ్వరని కొందరు అంటున్నారు
- ఆ విషయం బిల్లులో ఎక్కడైనా ఉందా?
- సరైన సమయంలో రాష్ట్ర హోదాను కల్పిస్తాం
జమ్మూకశ్మీర్ ను కేంద్ర ప్రభుత్వం రెండు యూటీలుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లడఖ్ అనే రెండు యూటీలుగా విభజించింది. అయితే, జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను కల్పించాలని కాంగ్రెస్ తో పాటు ఆ ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు లోక్ సభలో జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుపై ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెప్పారు.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు చేస్తే ఎప్పటికీ రాష్ట్ర హోదా రాదని కొందరు ఎంపీలు అంటున్నారని... జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా రాదనే అంశం ఈ బిల్లులో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోదా రాదనే తుది అభిప్రాయానికి మీరెలా వచ్చారని ప్రశ్నించారు. ఈ సవరణ బిల్లుకు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
గత సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ రాజ్యసభలో మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ కు రాష్ట్రహోదా ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని... కానీ, జమ్మూకశ్మీర్ ను ఎప్పటికీ యూటీగానే ఉంచాలనే ప్రయత్నం కేంద్రం చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.