ఓటు వేసొచ్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచి అభ్యర్థి
- కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కనకదుర్గ
- ఈ ఉదయం ఓటు వేసిన వెంటనే ప్రారంభమైన నొప్పులు
- కైకలూరు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కనకదుర్గ
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ పోలింగ్ రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేశారు. 9 నెలల గర్భిణి అయిన ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
ఈ ఉదయం తన ఓటు హక్కును ఆమె వినియోగించుకున్నారు. ఓటు వేసిన కాసేపటికే ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో, ఆమెను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ రోజున బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. కోరుకల్లు సర్పంచ్ స్థానాన్ని మహిళలకు కేటాయించారు.