తొలి రోజు 'ఉప్పెన'‌ సినిమాకు భారీ వసూళ్లు!

  • నిన్న విడుద‌లైన ఉప్పెన‌
  • చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా
  • ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్
  • నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్ లో రూ.1.43 కోట్లు
చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ఉప్పెన తొలి రోజు భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్ల‌స్ పాయింట్ అయింది.  

శ్రీమ‌ణి రాసిన‌ 'నీ క‌న్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మ‌రింత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. ఈ నేప‌థ్యంలో తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్ లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబ‌ట్టింది.

కృష్ణా జిల్లాలో రూ.0.62 కోట్లు, గుంటూరులో రూ.0.65 కోట్లు, నెల్లూరులో 0.35 కోట్లు రాబ‌ట్టింది. ఆంధ్రాలో మొత్తం క‌లిపి రూ.4.87 కోట్లు రాబ‌ట్టింది. నైజాం, ఏపీలో క‌లిపి మొత్తం రూ.9.3 కోట్లు వ‌సూలు చేసింది. క‌ర్ణాట‌క‌లో రూ.52 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడులో రూ.16 ల‌క్ష‌లు,  ఓవ‌ర్ సీస్‌లో రూ.34 ల‌క్ష‌లు రాబ‌ట్టింది.


More Telugu News