ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు పంపిణీ చేసిన సినీ నటుడు సోనూసూద్

  • మరోమారు పెద్ద మనసు చాటుకున్న సోనూ సూద్
  • స్వస్థలంలో ఎలక్ట్రిక్ రిక్షాల పంపిణీ
  • సాయం చేయగలిగే స్థితిలో ఉన్నవారు అవసరార్థులకు సాయం చేయాలని పిలుపు
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోమారు దొడ్డ మనసు చాటుకున్నాడు. తన స్వస్థలమైన పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు (ఈ-రిక్షా) అందించాడు. ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నాడు.

సాయం చేయగలిగే స్థితిలో ఉండే ప్రతి ఒక్కరు అవసరమైన వారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చాడు. తనకు సేవాగుణం అలవడడానికి తన తల్లిదండ్రులే కారణమన్నాడు. అవసరమైన వారికి సాయం చేస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు సోనూ చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ పాల్గొన్నారు.


More Telugu News