ప్రధానిపై అభ్యంతరకర వీడియో.. సుందర్ పిచాయ్ పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులు
- మోదీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా యూట్యూబ్‌లో వీడియో
- అభ్యంతరం తెలిపిన వ్యక్తికి వేలాది బెదిరింపు కాల్స్
- గూగుల్ ప్రతినిధులు సహా 17 మందిపై కేసు
ఓ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా మరో ముగ్గురు గూగుల్ ఇండియా ఉన్నతాధికారుల పేర్లను తాజాగా తొలగించారు. వాట్సాప్, యూట్యూబ్‌లో వైరల్ అయిన ఓ వీడియో ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఉండడంతో వారణాసికి చెందిన ఓ వ్యక్తి దానిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో అతడికి ఏకంగా 8,500 బెదిరింపు కాల్స్ రావడంతో ఈ నెల 6న భేల్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో గూగుల్ ప్రతినిధులు సహా తొలుత 17మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో సుందర్ పిచాయ్ సహా ఆ సంస్థకు చెందిన మరికొందరు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే, విచారణ చేపట్టిన అధికారులు పిచాయ్, ముగ్గురు గూగుల్ ఇండియా ప్రతినిధులకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధమూ లేదని గుర్తించి వారి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. కాగా, ఈ వీడియోను గాజీపూర్ జిల్లాకు చెందిన సంగీత కళాకారులు రూపొందించినట్టు భావిస్తున్న పోలీసులు వారి పేర్లను మాత్రం ఎఫ్ఐఆర్‌లో అలాగే ఉంచారు.