ఏపీ పంచాయతీ ఫైట్: రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- ఆరున్నర గంటలకు ప్రారంభమైన పోలింగ్
- మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్
- సర్పంచ్ స్థానాలు 539, వార్డు స్థానాలు 12,604 ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఈ దశలో మొత్తం 3,328 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 539 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 2,786 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
సర్పంచ్ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, 33,570 వార్డులకు గాను 12,604 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన వార్డులకు ఎన్నికలు అనివార్యం కాగా, 44,876 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగుతుంది.