అరకులో ఘోర రోడ్డు ప్రమాదం... తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
- 30 మంది పర్యాటకులతో వెళుతున్న బస్సు
- అనంతగిరి మండలంలో లోయలోకి దూసుకెళ్లిన వైనం
- 8 మంది మృతి
- పలువురికి తీవ్ర గాయాలు
- ఈ ఘటన దురదృష్టకరమన్న చంద్రబాబు
ప్రకృతి అందాలకు మారుపేరుగా నిలిచే విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది ప్రయాణికులతో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు అనంతగిరి మండలం డముక వద్ద ఐదో నెంబరు మలుపు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ బస్సులో ఉన్నవారిని హైదరాబాదుకు చెందినవారిగా గుర్తించారు.
కాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అరకు ఘాట్ రోడ్డులో జరిగిన విషాద ఘటన కలచివేసిందని పేర్కొన్నారు. ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడిన సంఘటన చాలా దురదృష్టకరమని, బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాల బాధను తాను కూడా పంచుకుంటున్నానని, సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు.