ఏపీ మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు
- ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు
- ఈ నెల 17న మూడో విడత పోలింగ్
- మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో భారీగా ఏకగ్రీవాలు
- 85 పంచాయతీలు ఏకగ్రీవం
- కేవలం రెండు పంచాయతీల్లో ఎన్నికలు
ఏపీలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలి రెండు విడతలతో పోల్చితే మూడో విడతలో ఏకగ్రీవాల సంఖ్య భారీగా నమోదవుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని 67 పంచాయతీల్లో 63 ఏకగ్రీవం కాగా, కేవలం 4 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోనూ భారీగా ఏకగ్రీవాలు అయినట్టు అధికారులు ప్రకటించారు. పుంగనూరు నియోజకవర్గంలో 87 పంచాయతీలు ఉండగా, వాటిలో 85 ఏకగ్రీవం అయ్యాయి. రొంపిచెర్ల మండలంలోని 2 పంచాయతీలకు మాత్రమే ఎన్నికల ద్వారా ఫలితం తేలనుంది. పుంగనూరు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం.