ఆరేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేయడమే అద్భుతమా?: జానారెడ్డి
- టీఆర్ఎస్ అద్భుతాలు చేస్తోందని అంటున్నారు
- కాంగ్రెస్ చేసిన మంచిని కేసీఆర్ అభినందించరా?
- మేం చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయాన్ని టీఆర్ఎస్ పంచిపెడుతోంది
కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని... ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని అంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడే సమయానికి రూ. 70 వేల కోట్ల అప్పు ఉందని... ఆరేళ్లలో అప్పును మూడున్నర లక్షల కోట్లకు పెంచడం అద్భుతమా? అని ప్రశ్నించారు. మంచిని అభినందించండి అని కేసీఆర్ అంటున్నారని.. మరి ఏనాడైనా కాంగ్రెస్ చేసిన మంచిని ఆయన అభినందించారా? అని నిలదీశారు. రైతుబంధు పథకాన్ని తాము అభినందిస్తున్నామని... కానీ, రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.
ఇతరులను అభినందించండి అని అడిగే ముందు... కాంగ్రెస్ ని కూడా అభినందించడం నేర్చుకోవాలని అన్నారు. ప్రతి దళితుడికి మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. 10 లక్షల ఎకరాల భూమిని పంచాలంటే రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. తాము చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయాన్ని టీఆర్ఎస్ పంచిపెడుతోందని విమర్శించారు.