ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్... పార్టీ సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చన్న హైకోర్టు
- జోగి రమేశ్ పై 3 పార్టీలు ఫిర్యాదు
- సభలు, సమావేశాల్లో రమేశ్ మాట్లాడరాదంటూ ఎస్ఈసీ ఆదేశాలు
- ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన జోగి రమేశ్
- లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేశ్ పై ఎస్ఈసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, ప్రచారంలోనూ మాట్లాడరాదంటూ జోగి రమేశ్ పై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఏపీలో మూడు పార్టీలు ఫిర్యాదు చేసిన మీదట ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై జోగి రమేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జోగి రమేశ్ పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని పేర్కొంది. అయితే, పంచాయతీ ఎన్నికల అభ్యర్థులతో జోగి రమేశ్ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.