ఆ గ్రామాలను ఏపీ తీసుకుందంటూ ఒడిశా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది... చంద్రబాబు ఇప్పుడేమంటారో?: విజయసాయిరెడ్డి

  • వివాదాస్పదంగా మారిన ఏపీ, ఒడిశా సరిహద్దు గ్రామాలు
  • సుప్రీంను ఆశ్రయించిన ఒడిశా సర్కారు
  • పత్రికల్లో తప్పుడు కథనాలు వచ్చాయన్న విజయసాయిరెడ్డి
  • ఓట్ల కోసం రెచ్చగొట్టారని వ్యాఖ్యలు
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొటియా గ్రామాల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కొటియా గ్రామాలంటే ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు అని, ఇటీవల దీనిపై జ్యోతి, ఈనాడు తప్పుడు కథనాలు రాశాయని ఆరోపించారు.

ఓట్ల కోసం పచ్చ కుల నేతలు రెచ్చగొట్టారని, తీరా చూస్తే ఆ గ్రామాలను ఏపీ తీసుకుందంటూ ఒడిశా ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని తెలిపారు. దీనిపై చంద్రబాబు ఏమంటారో అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. సరిహద్దు ప్రాంతంలోని తమ గ్రామాలకు పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ ఒడిశా సర్కారు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ గ్రామాలు తనవేనని ఒడిశా చెబుతోంది.


More Telugu News