మా ఫిర్యాదులు పట్టించుకోకుండా మీ వ్యక్తిగత విషయాలకే ఎక్కువ నోటీసులిస్తున్నారు: ఎస్ఈసీపై విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం
- ఎస్ఈసీపై కొడాలి నాని వ్యాఖ్యలు
- షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎస్ఈసీ
- ఏపీలో షోకాజ్ నోటీసుల పరంపర కొనసాగుతోందన్న విష్ణు
- తమ ఫిర్యాదులను కూడా పట్టించుకోవాలని విజ్ఞప్తి
- బాధ్యులకు నోటీసులు పంపాలని సూచన
ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఏపీలో షోకాజ్ నోటీసుల పరంపర కొనసాగుతోందని తెలిపారు.
అయితే, తాము అనేక ఫిర్యాదులు చేసినా ఎస్ఈసీ పట్టించుకోవడంలేదని, కానీ తన వ్యక్తిగత విషయాలపై మాత్రం స్పందిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విపక్ష పార్టీల మద్దతుదారులు ఇచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించి బాధ్యులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జగన్నాథ రథచక్రాల కింద పడి నిమ్మగడ్డ నలిగిపోతారని, స్థానిక ఎన్నికల్లో ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా తమదే విజయం అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ వ్యాఖ్యలపై నేటి సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.