ప్రకాశం జిల్లా నరిశెట్టివారి పాలెంలో మూకుమ్మడిగా నామినేషన్ల ఉపసంహరణ!
- తమ పొలాలు వేరే రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నాయన్న గ్రామస్థులు
- తమ సమస్యను పరిష్కరించాలని నిరసన
- నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నరిశెట్టివారి పాలెం గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నారు. తమ పొలాలు వేరే రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నాయని, తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ విధంగా నిరసన తెలిపామని వివరించారు. కాగా, మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ఇప్పటికే ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగియనుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.