ఏపీలో 853కి పడిపోయిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
- గత 24 గంటల్లో 30,257 మందికి కరోనా పరీక్షలు
- అత్యధికంగా విశాఖ జిల్లాలో 18 మందికి పాజిటివ్
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు
- రాష్ట్రంలో కరోనా మరణాలు నిల్
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 30,527 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 87 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 18 కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 4 కేసులు వెలుగు చూశాయి.
అదే సమయంలో 79 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,692 కాగా 8,80,678 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 853కి తగ్గింది. కరోనా మృతుల సంఖ్య 7,161గా నమోదైంది.