ప్రభుత్వ విమానం ఏ ఒక్కరి వ్యక్తిగత సొత్తు కాదు: 'మహా' సీఎంపై ఫడ్నవీస్ విసుర్లు

  • డెహ్రాడూన్ వెళ్లాలని భావించిన గవర్నర్
  • ముంబయి ఎయిర్ పోర్టులో 2 గంటలపాటు ఎదురుచూపులు
  • విమాన ప్రయాణానికి అనుమతించని సర్కారు
  • రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఫడ్నవీస్
  • ఇంత అహంభావం పనికిరాదని వ్యాఖ్యలు
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి ప్రభుత్వ విమానంలో ప్రయాణానికి అనుమతి నిరాకరించడంపై సీఎం ఉద్ధవ్ థాకరేపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విమానం ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. విమానం ఎక్కిన గౌరవనీయ గవర్నర్ ను దించేస్తారా? మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి ఇంత అహంభావం ఎక్కడి నుంచి వస్తోంది? మహారాష్ట్రలో ఇంతటి ఇగో ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు అని అన్నారు.

ఇవాళ గవర్నర్ కోష్యారీ డెహ్రాడూన్ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయంలో దాదాపు 2 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. టేకాఫ్ కు అనుమతి లేదంటూ విమాన కెప్టెన్ చెప్పడంతో ప్రభుత్వ విమానం నుంచి గవర్నర్ కోష్యారీ కిందికి దిగారు. ఆ తర్వాత మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుని డెహ్రాడూన్ వెళ్లారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అధికార శివసేనపై బీజేపీ మండిపడుతోంది.


More Telugu News