విశాఖ ఉక్కు వెనుక ఒడిశా కుట్ర ఉంది: ఏపీ మంత్రి అవంతి

  • ధర్మాన్ ప్రధాన్ ఒడిశాకు చెందినవారు
  • రాష్ట్రాన్ని కేంద్రం సంప్రదించలేదు
  • జగన్ కు తెలిసే జరిగిందని ప్రచారం చేయడం సరికాదు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజకీయ రంగును పులుముకుంది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఒడిశా నేతల కుట్ర ఉందని అవంతి ఆరోపించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు చెందినవారు కావడం దురదృష్టకరమని చెప్పారు.

ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సంప్రదించలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే అంతా జరిగిందని ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. ఈ ప్రచారం దుర్మార్గమని అన్నారు. కేంద్రంతో రాష్ట్రం లాలూచీ పడిందనేది అవాస్తమని అన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అంగీకరించబోమని చెప్పారు.


More Telugu News