మీ బెదిరింపులు నన్నేమీ చేయలేవు: అమిత్ షాకు దీదీ కౌంటర్
- నన్ను బెదిరించే ప్రయత్నం చేయకండి
- ఆట ఆడేందుకు సిద్ధంగా ఉన్నా
- మీ గూండాయిజం బెంగాల్ లో పని చేయదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెదిరింపులకు తాను భయపడబోనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ కు ఆయన ఎప్పుడు వచ్చినా తాము స్వాగతిస్తామని... అయితే ఆయన ఇక్కడకు వచ్చి కించపరుస్తూ మాట్లాడతారని విమర్శించారు. ఇక్కడకు వచ్చి ప్రచారం చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని... అయితే తనను బెదిరించే ప్రయత్నం చేయవద్దని, మిమ్మల్ని చూసి తాను భయపడనని అన్నారు.
బెంగాల్ లోని ఠాకూర్ నగర్ లో జరగాల్సిన అమిత్ షా కార్యక్రమం కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ, 'అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దయింది. మమతా దీదీ చాలా సంతోషంగా ఉంటారు. ఏప్రిల్ వరకు సమయం ఉంది. ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తా. ఎన్నికలలో మీరు ఓడిపోయేంత వరకు వస్తూనే ఉంటా' అని అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలకు దీదీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆట ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. మీరు ఎన్ని గోల్స్ స్కోర్ చేస్తారో నేనూ చూస్తా అని వ్యాఖ్యానించారు. ఇది బెంగాల్ అని... మీ గూండాగిరి ఇక్కడ పని చేయబోదని చెప్పారు. అమిత్ షా బాడీ లాంగ్వేజ్, మనస్తత్వం, భయపెట్టే తీరు ఆయన పదవికి సరిపోవని అన్నారు.