వ్యవసాయ చట్టాలతో పంటలను అపరిమితంగా నిల్వ చేసుకునే ప్రమాదం ఉంది: రాహుల్ గాంధీ

  • లోక్ సభలో రాహుల్ ప్రసంగం
  • వ్యవసాయ చట్టాలతో నిత్యావసరాల చట్టానికి ఎసరు తప్పదని వ్యాఖ్యలు
  • రైతులు కోర్టుకు వెళ్లే అవకాశం కోల్పోతారని వెల్లడి
  • మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటుందని వివరణ
జాతీయ వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ లోక్ సభలో మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాల కారణంగా పంటలు అపరిమితంగా నిల్వ చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు. ఈ చట్టాలతో నిత్యావసరాల చట్టానికి ఎసరు తప్పదని హెచ్చరించారు. పైగా, రైతులు కోర్టుకు వెళ్లే అవకాశాలు కోల్పోతారని రాహుల్ గాంధీ వివరించారు. మార్కెట్ వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవసాయ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం అన్నదాతల ఉద్యమం కాదు, జాతి ఉద్యమం అని పేర్కొన్నారు. ఆందోళనలు చేపడుతున్న స్థలాల నుంచి రైతులు కదలరని, ప్రభుత్వాన్నే కదిలిస్తారని రాహుల్ ఉద్ఘాటించారు. నలుగురు వ్యక్తులకు లబ్ది చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, నోట్ల రద్దు కూడా నలుగురు వ్యక్తుల ప్రయోజనం కోసమే చేశారని ఆరోపించారు. నలుగురు వ్యక్తులే దేశాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.


More Telugu News