టీమిండియాతో టీ20 సిరీస్ కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
- భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు
- టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీ20 సిరీస్
- 16 మందితో టీ20 జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
- మార్చి 12 నుంచి టీ20 సిరీస్
- అన్ని మ్యాచ్ లు అహ్మదాబాద్ లోనే!
ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. అయితే త్వరలో ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది.
ఈ సిరీస్ లో పాల్గొనే 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ ఎంపిక చేశారు. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విజయవంతమైన ఇయాన్ మోర్గాన్ నే సారథిగా కొనసాగించారు. జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్ తదితరులతో ఇంగ్లండ్ పటిష్టంగా కనిపిస్తోంది.
ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 5 మ్యాచ్ లు అహ్మదాబాద్ స్టేడియంలోనే నిర్వహిస్తారు. ఇక, మార్చి 23 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. వన్డే సిరీస్ లో ఆడే ఇంగ్లండ్ జట్టును తర్వాత ప్రకటిస్తారు. కాగా ప్రస్తుతం ప్రకటించిన టీ20 జట్టు ఫిబ్రవరి 26న ఇంగ్లండ్ లో బయల్దేరనుంది.
ఇంగ్లండ్ జట్టు...
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, మొయిన్ అలీ, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, శామ్ బిల్లింగ్స్, అదిల్ రషీద్, రీస్ టాప్లే.
రిజర్వ్ ఆటగాళ్లు..
జేక్ బాల్, మాట్ పార్కిన్సన్