నూతన మేయర్, డిప్యూటీ మేయర్ లకు అసదుద్దీన్ ఒవైసీ శుభాకాంక్షలు

  • జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక
  • డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత
  • మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు పలికిన ఎంఐఎం
  • నూతన మేయర్ సారథ్యంలో నగరం మరింత ఎదగాలన్న ఒవైసీ
సర్వత్రా ఆసక్తి కలిగించిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక పూర్తయింది. టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి (టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె) గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా టీఆర్ఎస్ కే చెందిన మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో టీఎఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు.

వీరిద్దరి నాయకత్వంలో హైదరాబాద్ నగరం మరింత అభ్యున్నతి సాధిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాదు పాతబస్తీ సహా అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతాయని ఆశిస్తున్నామని వివరించారు. జీహెచ్ఎంసీ తన కార్యకలాపాలు నిజాయతీగా, ఆర్థిక సాధికారతతో నిర్వర్తిస్తుందని ఆకాంక్షిస్తున్నామని ఒవైసీ తెలిపారు. అంతేకాకుండా, తమకు డిప్యూటీ మేయర్ పదవి ఆఫర్ చేసిన టీఆర్ఎస్ ను ప్రశంసిస్తున్నామని పేర్కొన్నారు.


More Telugu News