స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో రాష్ట్రానికి జరిగిన చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలి: శైలజానాథ్ డిమాండ్
- రాష్ట్రాన్ని మేకవన్నె పులులు పాలిస్తున్నాయి
- పోస్కో ప్రతినిధులు జగన్ తో భేటీ అయ్యారని కేంద్ర మంత్రి చెప్పారు
- కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతోందన్న శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ ను మేకవన్నె పులులు పాలిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడం వెనుక రెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. 2019లోనే దీనికి సంబంధించి ఒప్పందం జరిగిందని... పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ తో కూడా భేటీ అయ్యారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారని తెలిపారు. కేంద్రం చెప్పిన వివరాలు నిజమా? కాదా? అనే విషయాన్ని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిజం అయితే... ఏమీ తెలియనట్టు ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు.
కేంద్రంతో, రాష్ట్రానికి జరిగిన చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ అగ్రనాయకులు కలిసి విశాఖ ఉక్కు కుంభకోణానికి పాల్పడుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గత కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసిందని... అలాంటి సంస్థను తాము కాపాడుకుంటామని చెప్పారు. విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతోందని అన్నారు.