రెండో టెస్టులోనైనా బాగా ఆడండి: స‌్టార్ బ్యాట్స్‌మెన్‌కు వీవీఎస్ లక్ష్మణ్ సూచన
- రోహిత్ శర్మ, అజింక్యా రహానే ఆటతీరు బాగోలేదు
- రెండో టెస్టులోనైనా వారిద్దరు నిబద్ధతతో ఆడాలి
- రెండో టెస్టును వారిద్దరు బాగా ఆడి గెలిపించాలి
చెన్నైలో ఇటీవల జరిగిన భారత్-ఇంగ్లండ్ మొదటి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రోహిత్ శర్మ, అజింక్యా రహానే ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 13 నుంచి జరగనున్న రెండో టెస్టులోనైనా వారిద్దరు నిబద్ధతతో ఆడతారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. రెండో టెస్టును వారిద్దరు బాగా ఆడి గెలిపించాలని కోరుకుంటున్నానని చెప్పారు. చెన్నై టెస్టులో రహానెలో ఏమాత్రం పోరాట పటిమ కనపడలేదని చెప్పారు.
అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినప్పటికీ రహానె ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొన్నాడని, దీంతో ఔటయ్యాడని అన్నారు. అలాగే, స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయిన రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌ని వదిలేశాడని, ఈ నేపథ్యంలోనే బౌల్డ్ అయ్యాడని లక్ష్మణ్ వివరించారు. ఇకపై అయినా వారిద్దరు జాగ్రత్తగా ఆడాలని చెప్పారు.